లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలని ఎవరికి ఉండదు. కానీ అమ్మవారి కటాక్షం కొందరికే ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు అదృష్టాన్ని దూరం చేస్తాయట. మరి ఆ తప్పులేంటో చూద్దాం. డబ్బు లేకుంటే ఏ పనీ అవదు. ప్రస్తుత కాలంలో డబ్బే సర్వస్వమైపోయింది. మరి ధనం రావాలంటే ఏం చేయాలి? అంటే ఇంటి తలుపులు, కిటికీల తెరిచే సమయం కూడా మన ఆర్థిక స్థితిగతులను నిర్ణయిస్తుందట. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే.. ఇంటి తలుపులు, కిటికీలు తెరవడానికి ఒక సమయం కచ్చితంగా ఉందని పండితులు అంటున్నారు.
ఉదయం, సాయంత్రం తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడానికి అనుకూలమైన సమయం. ఎందుకంటే.. సూర్యోదయానికి ముందు సమయాన్ని మనం బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తూ ఉంటాం. ఈ బ్రహ్మ ముహూర్తంలో తూర్పు దిశలో ఉన్న అన్ని తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందట. ఇక సూర్యోదయం తరువాత ఉత్తర దిశలో ఉన్న తలుపులు, కిటికీలను తెరిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందట. ఇంటి ముఖ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలట. ద్వారానికి పసుపు, ఎరుపు రంగులతో ముగ్గులు వేయాలట. లక్ష్మీదేవికి చీకటి అంటే ఇష్టముండదట. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ సహజ కాంతి ఉండేలా చూసుకోవాలట.