గుండాలేశ్వరస్వామి ఆలయంలోని గుండంలో మునిగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..

కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుండాలకోనలోని శివాలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ శివుడు ఆసక్తికరంగా ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్ష దర్శనమిస్తాడని కూడా తెలుసుకున్నాం. ఇక ఈ ఆలయంలోని గుండాల కోన మరో ప్రత్యేకత. సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి నీరు ఉద్ధృతంగా వచ్చి ఈ గుండాల కోనలో చేరుతుంది. ఇప్పటి వరకు ఈ గుండం లోతు చూసిన వారు లేరని స్థానికులు చెబుతారు. ఏడాది పొడుగునా సందర్శకులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలోనూ, శివరాత్రి పర్వ దినాలలోనూ భక్తులు విశేషంగా దర్శిస్తారు.

ఈ ఆలయంలోని శివయ్యను విశ్వామిత్రుడు ప్రతిష్ఠించాడట. గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాల కోనగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గుండంలో మునిగితే చాలా ప్రయోజనాలున్నాయి. సర్వపాపాలు తొలగిపోవడమే కాకుండా దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే ఒక గుహ ఉంటుంది. ఈ గుహలోనే భక్తులకు గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో దర్శనం ఇస్తాడు. భక్తులు పూజలు చేసి నైవేద్యంగా ఫలాలను గుహ ద్వారంలో పెడతారు. వాటిని ఎండ్రకాయలోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు.

Share this post with your friends