మహావిష్ణువు భక్తుల జోలికి వెళ్లొద్దని చెబితే యమ భటులు ఏం చేశారంటే..

కాశీ పట్టణంలోని ఆలయాల్లో భాగంగా యమాదిత్య ఆలయం గురించి తెలుసుకున్నాం. కాశీకి వెళ్లినవారు యమాదిత్యుడిని దర్శించుకుంటే మరణానంతరం యమ యాతనలకు చోటుండదట. ఇక ఈ ఆలయ కథేంటో తెలుసుకుందాం. శ్రీమహావిష్ణువును అనునిత్యం ఆరాధించే మహా భక్తుల జోలికి వెళ్లొద్దని సూర్యుని పుత్రుడైన యమ ధర్మరాజు ఒకరోజు తన భటులకు చెప్పాడట. కానీ యమ భటులు ఆ మాటలను విస్మరించారు. సూర్య భగవానుడి భక్తుడైన సత్రాజిత్తు దగ్గరికి వెళ్లి సూర్యుని ఆగ్రహానికి గురవుతారు. విషయం యమ ధర్మరాజుకి తెలిసింది.

తమ భటుల అపరాధాన్ని మన్నించమని కోరుతూ అందుకు ప్రాయశ్చితంగా సూర్యభగవానుని మూర్తిని కాశీ క్షేత్రంలో ప్రతిష్ఠించి యముడిని సేవిస్తూ ఆయన అనుగ్రహానికి యమ ధర్మరాజు పాత్రుడవుతాడు. ఆదిత్యుడిని యముడు ప్రతిష్టించాడు కాబట్టి ఇక్కడి సూర్య భగవానుడికి యమాదిత్యుడిగా ఇక్కడ సూర్య భగవానుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ యమాదిత్యుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శాశ్వత స్వర్గం ప్రాప్తిస్తుందట. ముఖ్యంగా మంగళవారం నాడు చతుర్దశి రోజున గంగలో స్నానమాచరించి యమాదిత్యుడిని దర్శించకుంటే పాప విముక్తులవుతారట.

Share this post with your friends