ఈ రోజుల్లో చాలా మంది దంపతులు సంతాన లేమితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. ఎవరేది చెబితే అది పాటిస్తూ నానా తిప్పలు పడుతున్నారు. అయితే సంతాన లేమికి కర్మ కూడా కారణం కావొచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గత జన్మలో ఎప్పుడైనా కానీ.. ఈ జన్మలో కానీ చేసిన తప్పులు సంతాన లేమికి కారణమవుతాయట. వాటి ఫలితంగానే సంతాన సమస్యలు తలెతతవచ్చట. కర్మ ఫలితాల నుంచి విముక్తి పొందితే సంతానం తప్పక ప్రాప్తిస్తుందట. మరి దీనికి ఏం చేయాలి?
కర్మ ఫలితాల నుంచి విముక్తి పొంది.. సంతానం పొందడానికి పరమేశ్వరుడు పుత్రకామేష్టి శ్లోకం పఠించాలని చెప్పాడని పండితులు చెబుతున్నారు. మరి పుత్రకామేష్టి శ్లోక పారాయణం ఎలా అంటారా? రామాయణం బాలకాండలోని 15, 16 సర్గలను ‘పుత్రకామేష్టి సర్గలు’ అని కూడా పిలుస్తారు. వాటిని పారణం చేస్తే చాలట. ఆ సర్గలలో ఏముందంటే..దేవతలు శ్రీ మహవిష్ణువు దగ్గరకి వెళ్లి.. “రావణాసురుడి బారి నుంచి తమని కాపాడమని వేడుకున్నారట. అప్పుడు విష్ణు మూర్తి తాను దశరథుడి ఇంట పుడతానని చెప్పాడట. అప్పుడు దశరథుడు పుత్ర కామేష్టి శ్లోకం పారాయణం చేస్తుండగా.. పాయస పురుషుడు పాయసం ఇచ్చాడట. అది తీసుకున్న దశరథుడి భార్యలు పండంటి బిడ్డలను కన్నారు. కాబట్టి సంతానం లేని వారు తప్పక పుత్ర కామేష్టి సర్గలను పారాయణం చేయాలట.