పంచముఖ హనుమను ఎలా పూజించాలి? విశిష్టత ఏంటి?

రామాలయం ప్రతి గ్రామంలోనూ దాదాపు ఉంటుంది. ఇక రామాలయం ఉందంటే హనుమంతుడు ఉండడా? ఆయన కూడా కొలువై ఉంటాడు. ఆలయంలోనే కాదు.. రామ నామం వినిపించినా ప్రతి చోటా ఆంజనేయుడు ఉంటాడని చెబుతారు. ఇక హనుమంతుడి గురించి మనకు తెలియనిది ఏముంది కానీ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి తెలుసా? ఐదు ముఖాలను కలిగిన ఆంజనేయుడు అన్నమాట. వీరాంజనేయుడు, దాసాంజనేయడు, కార్యసిద్ధి హనుమ, దాసాంజనేయ, అభయాంజనేయుడనే ఐదు పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. పంచముఖ హనుమ విశిష్టత ఏంటి? ఆయనను పూజించే విధానమేంటో తెలుసుకుందాం.

పంచముఖ హనుమ విశిష్టత గురించి మీకు తెలుసా? పంచముఖ హనుమను దర్శిస్తే అయిదుగురు దైవాల అనుగ్రహం ఏక కాలంలో లభిస్తుందట. ఈ విషయం ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక పంచ ముఖ హనుమలో ఒక ముఖమైతే హనుమంతుడిదే.. మిగిలిన నాలుగు ముఖాలు.. మొదటిది నారసింహం.. రెండోది గరుత్మంత, మూడోది వరాహ, నాలుగవది హయనగ్రీవ. హనుమను పూజించిన విధంగానే పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి. హనుమ స్వరూపంలో విష్ణుమూర్తి కూడా ఉంటాడు కాబట్టి ఆయనకు ఇష్టమైన చందనం, తులసి వంటి ద్రవ్యాలతో పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిదట.

Share this post with your friends