శివుడిని ఏ సమస్య కోసం ఎలా పూజించాలి?

సోమవారం శివునికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున శివుడిని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందట. ముఖ్యంగా జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషాలు ఉన్నారు ఇవాళ శివుడిని పూజించాలట. సోమవారం రోజు రాగి పాత్రలో గంగాజలం తీసుకొని రుద్ర మంత్రం జపిస్తూ శివుడిని అభిషేకించాలట. 11 సోమవారాలు ఇలా నియమనిష్టలతో శివుడిని అభిషేకిస్తే శని దోషాలు తొలగి పోతాయట. ఇక అభిషేకం చేసే శివలింగం రావిచెట్టు కింద ఉన్నట్లయితే మరింత శ్రేష్టమని పండితులు చెబుతారు. శని దోషాల నుంచే కాకుండా వివిధ రోగాల నుంచి సైతం మృత్యుంజయుడైన శివయ్య మనల్ని సోమవారం నాడు పూజిస్తే రక్షిస్తాడట.

ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సోమవారం శివుడిని పూజించుకుంటే ఇబ్బందులు తొలగి పోతాయట. 11 సోమవారాల పాటు.. ఆవు పాలు, నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించి.. మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ మాయమవుతాయట. ఎంత ప్రయత్నించినా వివాహం కాకుంటే.. 11 సోమవారాలు కుంకుమ జలంతో సూర్యోదయ సమయంలో శివుడిని అభిషేకించాలట. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే.. 11 సోమవారాలు.. శివుడిని ఆవుపాలతో అభిషేకించి.. మారేడు దళాలు సమర్పించి.. 11 సార్లు బిల్వాష్టకం పఠించాలి. రాజయోగం కోరుకునే వారు సోమవారం విభూతితో శివుడిని అభిషేకించి.. లింగంపై విభూతిని కొత ఇంటికి తీసుకెళ్లి ప్రతిరోజూ నిద్రించే ముందు నుదుటన పెట్టుకోవాలట.

Share this post with your friends