రుద్రాభిషేకం ఎలా చేయాలి? దాని వలన కలిగే ప్రయోజనాలేంటి?

రుద్రాభిషేకం అనేది శివలింగానికి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేసే ఒక పవిత్రమైన ఆచారం. శివునికి రుద్రాభిషేకం చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి కొంత మేర తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తీర్థయాత్ర స్థల నీటితో శివునికి రుద్రాభిషేకం చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. అలాగే జన్మజన్మల పాపాలు నశించడంతో పాటు వ్యాధులు సైతం నశిస్తాయి. అలాగే శుత్రువులపై యుద్ధం చేసే ముందు శివునిపై రుద్రాభిషేకం చేస్తే విజయం తథ్యమట.

పుత్ర సంతానం కోరుకునే వారు శివుడిని ఆవు పాలతో అభిషేకించాలి. రుద్రాభిషేకం చేస్తే సంపదను పొందడంతో పాటు అప్పుల నుంచి ఉపశమనం.. సంపద, శ్రేయస్సు లభిస్తుంది. ప్రతికూలతను తొలగించడంతో పాటు దుష్ట శక్తులను దరి చేరనివ్వదు. అంతేకాకుండా సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. శివ రుద్రాభిషేకం చేయడం ద్వారా కాలసర్ప దోష ప్రభావం తగ్గడంతో పాటు ఇతర దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, మానసిక ప్రశాంతిత, అంతర్గత శాంతి, ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు.

Share this post with your friends