మహా కుంభ మేళా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మహా కుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమం. ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న ఈ మహా కుంభమేళా కోసం అన్ని ప్రత్యేక ఏర్పాట్లనూ నిర్వహించడం జరిగింది. ఈ మహా కుంభ మేళాలో ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, భక్తులు విశ్వాసంలో మునిగిపోతారు. ఈ మహా కుంభ మేళాలో ముఖ్యంగా ఆరు రాజ స్నానాలు నిర్వహిస్తారు. మొదటి రాజస్నానం అయితే జనవరి 13న నిర్వహించనున్నారు. జనవరి 13న పుష్య మాసం పౌర్ణమి. అందుకే మొదటి రోజు రాజ స్నానాన్ని పుష్య మాసం పౌర్ణమి స్నానం అని కూడా అంటారు.
మొదటి రాజ స్నానానికి శుభ సమయం ఏంటో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం నూతన సంవత్సరంలో పుష్య మాసం పూర్ణిమ తిధి జనవరి 13, 2025 ఉదయం 5.03 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే జనవరి 14, 2025 తెల్లవారుజామున 3.56 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో పౌర్ణమి తిథి జనవరి 13 సోమవారం జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజున పుష్య మాసం పూర్ణిమ స్నానం నిర్వహిస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం.. ఈ రోజున చేసే రాజ స్నానానికి బ్రహ్మ ముహూర్తం ఉదయం 5.27 నుంచి 6.21 వరకు ఉంది. ఈ సమయంలో రాజస్నానమాచరిస్తే ఫలితం మరింత బాగుంటుంది.