సూర్యుడు సమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అయినట్లు హను మంతుడు ప్రదక్షిణ అంటే ఇష్టపడతాడు. అందుకే హనుమకు ప్రదక్షిణలు చేస్తే తీరని కోరికంటూ ఏదీ ఉండదు. మిగిలిన దేవతలకు ఒకటి లేదా మూడు ప్రదక్షిణలు కనీసం చేస్తుంటారు. కానీ హనుమంతుడికి కనీసం ఒకటి లేదా అయిదు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. మొక్కుబడి ప్రకారం 108 ప్రదక్షిణలు చేసే వారుంటారు. హనుమంతుడికి నలభై రోజులపాటు 108 ప్రదక్షిణలు చేయడం ఒక ఆచారం. స్తోత్రపాఠాలతో, ప్రదక్షిణలతో ఆయనను తేలికగా మెప్పించవచ్చు.
2024-05-31