భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. దీనిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ముందుగా మనం భోగి పండుగ గురించి తెలుసుకుందాం. భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు భోగి పండుగను ఎలా జరుపుకోవాలి? భోగి మంటల ప్రాధాన్యం ఏంటంటనే విషయాలను తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ముందు రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం.

అసలు భోగి అనే పదం భుగ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ‘భోగం’ అంటే సుఖం. పురాణాల ప్రకారం.. శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందిందని చెబుతారు. దీనికి సంకేతంగానే భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పెద్దలు చెబుతారు. ఇక భోగి పండుగను ఎలా జరుపుకుంటామంటే.. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారు. అదే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు.

Share this post with your friends