రామ, రావణ యుద్ధం భీకరంగా మారింది. రామ లక్ష్మణులతో పాటు వానర సైన్యాన్ని ఎదుర్కోవడం రావణుడికి చాలా ఇబ్బందికరంగా మారింది. అప్పుడు రావణుడు.. కుంభ కర్ణుడిని రంగంలోకి దింపాడు. కుంభకర్ణుడు యుద్ధ రంగంలో పెను బీభత్సాన్ని సృష్టించాడు. నిజానికి కుంభకర్ణుడు యుద్ధాన్ని మరింత భీతావహంగా మార్చేశాడు. వానరులను నోట్లో వేసుకుని తినేశాడు. ఈ తరుణంలో లక్ష్మణుడు కుంభకర్ణుడు పైకి బాణాలను ప్రయోగించాడు. శరీరం నుంచి రక్తం కారుతున్నా కూడా కుంభకర్ణుడు లెక్క చేయలేదు. పైగా తాను రాముడిని చంపేసి వెళ్లిపోతానని తనను వదిలేయమని లక్ష్మణుడికి చెప్పాడు.
అయితే కుంభకర్ణుడు యుద్ధ రంగంలో ఉన్నంతసేపు వానరసేనకు కష్టమేనని భావించిన లక్ష్మణుడు అతడిని కిందపడేసత్ే తిరిగి పైకి లేవకుండా చూడవచ్చని భావించాడు. వానరాలన్నింటికీ ఒక్కసారిగా కుంభకర్ణుడిపైకి దూకాలని చెప్పగా అలాగే చేశాయి. కానీ ఫలితం లేదు. రాముడు తప్ప కుంభకర్ణుడిని ఎవరూ నిలువరించలేరని భావించిన వానరాలు రాముడికి మొర పెట్టుకున్నాయి. అప్పుడు రాముడు కుంభకర్ణుడి వక్షస్థలంలోకి గురి చూసి బాణాలు సంధించినా ఫలితం లేదు. ఆ తరువాత రెండు చేతులూ నరికేశాడు. అయినా సరే.. కుంభకర్ణుడు తగ్గకుంటే పాదాలతో పాటు తలను రాముడు బాణాలతో నరికేశాడు. రావణుడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోగా.. మిగిలిన సగం లంక ద్వారం వద్ద పడిపోయింది. మొత్తానికి కుంభకర్ణుడు మరణించాడు.