మధుర శ్రీరాముని వంశం నుంచి శ్రీకృష్ణుడి చేతికి ఎలా వచ్చిందంటే..

శూరసేన దేశానికి మథుర రాజధాని అని తెలుసుకున్నాం కదా. ఈ శూరసేన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మహాభారత గాథకు కేంద్ర బిందువైన కురుభూములకు ఈ శూరసేన దేశం దక్షిణంగా ఉంటుంది. ఈ మధురను లవణాసురుడిని సంహరించి శత్రుఘ్నుడు వశం చేసుకున్నాడని తెలుసుకున్నాం కదా. శత్రుఘ్నుని వంశీకుల తర్వాత మధుర యదువంశీకుల అధీనంలోకి వచ్చింది. పురాణాల ప్రకారం మధురను ఆయువు కుమారుడు నహుషుడు నిర్మించాడు. ఆయన కొడుకు యయాతి, దేవయాని దంపతులకు జన్మించిన వాడు యదువు. ఆ యదువు వారసులైన యదువంశీకుల అధీనంలోకి భారత భాగవతాల కాలంలో మధుర అధీనంలోకి వచ్చింది.

యయాతి కొడుకు యదువు, అతని కుమారుడు క్రోష్ఠుడు. అతనికి 42 తరాల తర్వాత వసుదేవుడు జన్మించాడు. ఆయన ఉగ్రసేనుడి కుమారుడు, తనకు మేనమామ అయిన కంసుని సంహరించాడు. కృష్ణుని అన్న బలరాముడు మధుర పరిపాలకుడయ్యాడు. కృష్ణుడు పశ్చిమదిక్కుకు వెళ్ళి ద్వారకను నిర్మించేంత వరకూ యదువంశీకులకు మధురే కేంద్రంగా ఉండేది. జరాసంధుని దాడుల్లో దెబ్బతిన్న మధురను తిరిగి కృష్ణుని మునిమనుమడు వజ్రనాభుని కాలంలో పునర్నించబడింది. తదుపరి కాలములో బృందావనమున శ్రీకృష్ణ భగవానునికి ఎన్నో ఆలయాలు నిర్మించబడ్డాయి. ద్వారకా నాథ్ మందిరము , మదన మోహన మందిరము, బంకె బిహారి మందిరం, రాధారమణ మందిరం, గోపీనాథ్ మందిరం, షాహాజీ మందిరం, రంగనాథ మందిరం తదితర ఆలయాలున్నాయి.

Share this post with your friends