శ్రీకృష్ణ పరమాత్ముడి లీలల గురించి మనకు తెలిసిందే. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన శ్రీకృష్ణుడు 100 మంది కౌరవుల సోదరులను మట్టి కరిపించారు. ఇక్కడి వరకే మనకు తెలుసు. ఆ తరువాత ఏం జరిగింది? కౌరవుల మాతా పితలైన ధృతరాష్ట్రుడు, రాణి గాంధారి పరిస్థితేంటి? అంటే.. వారిద్దరూ అంతమంది కుమారుల మరణంతో కృంగిపోతారు. కురుక్షేత్రం సంగ్రామం తరువాత శ్రీకృష్ణుడు హస్తినాపూర్ రాజభవనానికి తిరిగి వస్తాడు. అప్పుడు ఆయనను చూసిన గాంధారి పట్టరాని కోపంతో ఊగిపోతుంది. తన కుమారులను రక్షించలేదని శ్రీకృష్ణుడిని నిందిస్తుంది.
తన కుమారులంతా యుద్ధంలో మరణించినందున దానికి శ్రీకృష్ణుడు ఏమీ చేయలేదన్న ఉక్రోషంతో యాదవ వంశం నాశనమైపోతుందని.. ద్వారక సైతం వినాశనమవుతుందని.. ద్వారక నగరం సముద్రపు నీటిలో మునిగి పోతుందని శ్రీకృష్ణుడిని శపిస్తుంది. గాంధారి శాప ఫలితంగా శ్రీకృష్ణుడు మరణించడం.. యాదవ వంశం నాశనమవడం జరిగిపోయాయి. తన మృత్యువు సమీపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు అడవికి వెళ్లిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని జింక అనుకున్న వేటగాడు విషపూరిత బాణాన్ని శ్రీకృష్ణుడిపై సంధించడంతో ఆయన మరణిస్తాడు.