
మిళనాడులోని తంజావూరు నగరానికి 26 కి.మీ దూరంలో అమ్మపేట అనే మారుమూల గ్రామంలో వెన్ని కరుంబరేశ్వర్ ఆలయం ఉందని తెలుసుకున్నాం కదా. ఇక్కడి ఆలయానికి వెళ్లిన వారికి షుగర్ వ్యాధి నయమవుతుందట. అసలు ఈ ఆలయానికి వెళ్లిన వారికి షుగర్ వ్యాధి ఎలా నయమవుతుందనే కదా మీ ప్రశ్న. ఇదే డౌట్ వచ్చి ఇక్కడ జరిగే అద్భుతం గురించి కొన్ని పరిశోధనలు సైతం జరిగాయట. ఫలితాన్ని చూసి శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యారట. అసలు ఇక్కడికి వెళ్లిన వారికి మధుమేహం ఎలా నయమవుతుందో చూద్దాం. ఈ ఆలయానికి వెళ్లే షుగర్ వ్యాధిగ్రస్తులు అరకిలో బొంబాయి రవ్వ, అరకిలో చక్కర తీసుకుని వెళ్లాలి.
ఆలయంలో పూజ పూర్తైన మీదట.. రవ్వ చెక్కరను రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచాలి. ఆ తరువాత అక్కడకు చీమలు వచ్చి రవ్వను వేరు చేసి, చక్కెరను మాత్రమే తింటాయి. వాస్తవానికి దీనిని తిలకించేందుకు ఎంతో మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. చీమలు అక్కడ చక్కర తింటున్న సమయంలో శరీరంలోని చక్కర స్థాయిలు తగ్గిపోతాయట. చక్కర, రవ్వ మిశ్రమాన్ని ఆలయంలో పెట్టిన వారి శరీరంలోని చక్కెర స్థాయిలను చెక్ చేసి వైద్యులే కంగు తిన్నారట. వ్యక్తిలో షుగర్ తగ్గడం వాస్తవమని వైద్యులు సైతం అంగీకరించారు.
