ఇక్కడ ఆలయం మన కళ్లెదుటే అదృశ్యమవుతుంది.. మరో విశేషమేంటంటే..

ఆలయం అదృశ్యమవడం ఎక్కడైనా చూశారా? కానీ ఒకచోట మాత్రం ఆలయం అదృశ్యమవుతుంది. మళ్లీ అంతలోనే కనిపిస్తుంది.ఈ అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్‌కు వెళ్లాల్సిందే. అక్కడి సముద్రం ఒడ్డున స్తంభేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం గుజరాత్‌లోని వడోదరా నుంచి 50 కిలో మీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. శివ భక్తుడైన తారకాసురుడిని కార్తికేయుడు సంహరించాడు. అయితే అతను లోకకంటకుడు అయి ఉండొచ్చు కానీ మహాశివభక్తుడు కావడంతో కార్తికేయడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. విషయాన్ని గమనించిన విష్ణుమూర్తి ఈ అపచారం శివపూజతోనే తొలుగుతుందని చెప్పాడు.

ఆ వెంటనే కార్తికేయుడు విశ్వకర్మను పిలిచి ఆయనతో శివలింగాలను చెక్కించి పూజించాడు. వాటిలో ఒకటే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు. ఈ శివలింగం చుట్టూ ఆలయాన్ని 150 ఏళ్ల క్రితం నిర్మించారు. నిజానికి ఈ ఆలయం అద్భుత నిర్మాణమేమీ కాదు కానీ సముద్ర అలలకు అనుగుణంగా కనిపించడం, మాయమవడం జరుగుతూ ఉంటుంది. ఆలయం బయటకు రావడం.. అలాగే మునిగి పోవడం వంటివన్నీ చూసేందుకు భక్తులు సముద్రపు ఒడ్డునే వేచి ఉంటారు. ఇక ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. చంద్రుని కళలను అనుసరించి కూడా ఆలయం మారుతూ ఉంటుంది. చంద్రుడిని బట్టి ఆలయం ఒక్కోరోజు ఒక్కోతీరుగా దర్శనమిస్తూ ఉంటుంది.

Share this post with your friends