ఇంట్లో ఈ వస్తువులుంటే ధన ప్రవాహానికి లోటుండదట..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణ విషయంలోనే కాకుండా ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువులు సైతం మనకు మంచి చేస్తాయి. మన ఇంట నెగిటివ్ ఎనర్జీని పారదోలి పాజిటివిటీ నెలకొనేలా చేస్తాయి. కొన్ని రకాల వస్తువులు మన ఇంట అదృష్టాన్ని మోసుకొస్తాయట. ఆర్థిక సమస్యలు, ఇంటి గొడవలు, కుటుంబ సభ్యుల తగాదాలు దూరమవుతాయట. మరి ఇంట్లోని వారికి అంతటి అదృష్టాన్ని తీసుకొచ్చే వస్తువులేంటో తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ద ఇంట్లో ఉంటే ధన ప్రవాహం కలుగుతుందట. కాబట్టి కచ్చితంగా లాఫింగ్ బుద్దాను ఇంట్లో పెట్టుకుంటారు. దీనిని ఉత్తర దిక్కున హాల్‌లో పెడితే నెగిటివ్ ఎనర్జీ పోయి సంపద కూడా పెరుగుతుంది.

ఈవిల్ ఐ లాకెట్స్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయి ఉండొచ్చు. అవి ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాల ప్రజలు ఎక్కువగా వాడతారు. వీటి వలన దుష్ట శక్తుల ప్రభావం తగ్గడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందట. తాబేలును ఇంట్లో పెంచుకున్నా కూడా మంచి జరుగుతుందట. ఇంట్లో సంపద పెరుగుతుందట. అలాగే ఏనుగు విగ్రహాలు ఇంట ఉంటే చాలా మంచిదని చెబుతారు. ముఖ్యంగా వెండితో చేసిన ఏనుగు విగ్రహాలు ఉంటే సంపద పెరుగుతుందట. ఏనుగు విగ్రహాలను ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Share this post with your friends