హనుమంతుడికి వివాహం జరిగింది.. స్వామివారి భార్య పేరేంటో తెలుసా?

హనుమంతుడికి పెళ్లి కాలేదని ఆయన ఆ జన్మ బ్రహ్మచారి అని అంటూ ఉంటారు. మనం నిత్య జీవితంలో సరదాగా కూడా.. ఎవరినైనా పెళ్లెప్పుడు అని అడిగితే ఆంజనేయుడికి పెళ్లప్పుడు అని కూడా అంటూ ఉంటారు. అటువంటి ఆంజనేయుడికి పెళ్లి అయ్యిందని చెబుతుంటారు. ఆయన భార్య పేరు సువర్చల. అయితే పెళ్లి చేసుకున్నా కూడా హనుమంతుడు బ్రహ్మచారిగానే ఉండటంతో ఆయనను ఆజన్మ బ్రహ్మచారి అని అంటూ ఉంటారట. హనుమంతుడికి సూర్యుడు గురువు. సూర్యుడు నవ వ్యాకరణ పండితుడు కావడంతో ఆయన నుంచి ఎన్నో విద్యలను హనుమంతుడు నేర్చుకున్నాడు.

అయితే ఇంకా కొన్ని విద్యలను హనుమంతుడు నేర్చుకోవాల్సి ఉందని.. కానీ అవి నేర్చుకోవాలంటే హనుమంతుడు వివాహితుడు అయి ఉండాలని సూర్యుడు చెప్పాడు. లేదంటే నీవు సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేవని తెలిపాడట. దీంతో ఏం చేయాలో హనుమంతుడికి పాలు పోలేదట. ఇక సూర్యుడే దీనికి పరిష్కార మార్గాన్ని కూడా సూచించాడట. తన తపోశక్తితో ఓ ఆడపిల్లకు ప్రాణం పోసి ఆమెకు సువర్చల అని పేరు పెట్టాడట. అనంతరం సువర్చలను వివాహం చేసుకోమని ఆంజనేయునికి సూచించాడట. అలాగే నీతో వివాహమైన అనంతరం సువర్చల తపస్సులో మునిగిపోతుందని.. తద్వారా నువ్వు బ్రహ్మచారిగానే ఉంటావని సూర్యుడు తెలిపాడట. దీనికి అంగీకరించిన హనుమంతుడు సువర్చలను వివాహం చేసుకున్నాడట. ఆ వెంటనే సువర్చల తపస్సులోకి వెళ్లిపోవడం.. ఆంజనేయుడు బ్రహ్మచారిగా మిగిలిపోవడం జరిగాయట.

Share this post with your friends