రామాయణాన్ని హనుమంతుడు కూడా రాశాడట.. కానీ..

రామాయణాన్ని ఎవరు రాశారనగానే ఏమాత్రం ఆలోచన లేకుండా ఠపీమని వాల్మీకి మహర్షి అని చెబుతాం. అయితే రామాయణాన్ని హనుమంతుడు కూడా రాశాడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. నిజానికి శ్రీరాముడంటే అమితమైన భక్తి కలిగిన ఆంజనేయ స్వామి రామాయణాన్ని రచించాడంటే అది ఎంత రమ్యంగా ఉంటుంది? అలాంటి రామాయణం ఎందుకు వెలుగులోకి రాలేదు. అసలు ఆంజనేయుడు నిజంగానే రామాయణాన్ని రచించాడా? రచిస్తే అసలు ఆ రామాయణాన్ని ఎవరైనా చదివారా?

నిజంగానే హనుమంతుడు రామాయణాన్ని రచించాడట. రామరావణాసుర యుద్ధానంతంరం హనుమంతుడు ఒక పర్వతం వద్దకు వెళ్లి దానిపై తన గోళ్లతో రామాయణాన్ని రచించాడట. ఈ విషయం వాల్మీకికి తెలియడంతో ఆయన తనకు చూపించమని అడిగారట. వెంటనే వాల్మీకిని హనుమంతుడు తన భుజాలపై ఎక్కించుకుని తీసుకెళ్లి రామాయణాన్ని చూపించాడట. అది చూసిన వాల్మీకికి ఆనందభాష్పాలు వచ్చాయి. ఇంత రమ్యమైన రామాయణం ఉండగా తన రామాయణాన్ని ఎవరు పట్టించుకుంటారని ఒకింత ఆవేదన కూడా వ్యక్తం చేశారట. దీంతో హనుమంతుడు తను రాసిన రామాయణాన్ని తన చేతులతోనే నాశనం చేశాడట. అందుకే ఆయన రాసిన రామాయణం వెలుగులోకి రాలేదు.

Share this post with your friends