ఈ కృష్ణయ్య ఆలయంలో జన్మాష్టమి వేడుకల్లో 21 సార్లు గన్ పేలుతుంది..

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతాయి. జన్మాష్టమి అనగానే మనకు గుర్తొచ్చేది కన్నయ్య పుట్టిన మధుర, పెరిగిన బృందావనం. ఇక మరో ప్రత్యేకమైన ప్రదేశం గురించి కూడా మీకు తెలియాలి. అదేంటంటే.. రాజస్థాన్. అక్కడి సంస్కృతి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఇక్కడి ప్రాంతాలన్నీ ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే చాలా మంది సెలబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ ఓ కృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ కృష్ణుడికి 21 సార్లు గన్ పేల్చి సెల్యూట్ చేస్తారు. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్ ఆలయ విశేషమిది.

అన్ని ప్రాంతాల్లో జన్మాష్టమి రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రి 12 గంటలకు కన్నయ్య పుట్టిన తరువాత, పూజ హారతి ఇచ్చి ఉపవాసం విరమిస్తారు. శ్రీనాథ్ ఆలయంలో రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడికి 21 తుపాకుల వందనం చేస్తారు. రాత్రి 11:30 గంటలకు ఆలయాన్ని అరంగట పాటు మూసి వేసి 12 గంటలకు తలుపులు తెరుస్తారు. ఆ వెంటనే తుపాకీతో వందనం ఇచ్చి బ్యాండ్లు, సంగీత వాయిద్యాలు, డ్రమ్స్‌ను కూడా వాయిస్తారు. ఈ నాథ్ ఆలయం ఆరావళి పర్వత శ్రేణికి సమీపంలోని బనాస్ నది ఒడ్డున ఉంది. ఇక ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీనిని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వసం చేశాడని చెబుతారు. విగ్రహం మాత్రం సురక్షితంగా ఉందట.

Share this post with your friends