భగవంతునికి గన్నేరు పూలను సమర్పిస్తూనే ఉంటారు. అయితే కేరళలోని ప్రధాన ఆలయాల్లో మాత్రం గన్నేరు పూలను నిషేధించడం ఆసక్తికరంగా మారింది. అసలెందుకు గన్నేరు పూలను నిషేధిస్తున్నారు? అనే విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని మెజారిటీ దేవాలయాలను నిర్వహించే కేరళలోని రెండు ప్రధాన ఆలయ బోర్డులు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు, మలబార్ దేవస్వోమ్ బోర్డులు పవిత్రంగా భావించే గన్నేరు పూలను ఆలయాల్లోకి నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి కారణం కూడా టీడీబీ అధ్యక్షుడు ప్రశాంత్ వెల్లడించారు.
గన్నేరు పూలల్లో ప్రాణులకు హాని కలిగించే విషపూరిత పదార్థాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలిందని.. ఈ నేపథ్యంలోనే ఆలయాల్లోకి నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రశాంత్ వెల్లడించారు. అయితే ఈ గన్నేరు పూల స్థానంలో భగవంతుడికి ఏం సమర్పించాలో కూడా వెల్లడించారు. గన్నేరు పూలకు బదులుగా తులసి, తేచి, గులాబి, మల్లె, మందార వంటి పువ్వులను పూలను సమర్పించాలని సూచించారు. అలప్పుజాలో ఇటీవల ఒక మహిళ గన్నేరు పూలు, ఆకులు తిని మృతి చెందిందనే వార్తలతో పాటు రెండు రోజుల క్రితం పతనంతిట్టలో ఓ గోవు, దూడ గన్నేరు పూలు తిని మరణించాయి. ఈ వార్తలతో పాటు కొన్ని అధ్యయనాలు సైతం గన్నేరు పువ్వుల్లో విష పదార్థాలుంటాయని తేలడంతో ట్రావెన్‌కోర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పువ్వులతో పాటు కేరళలోని 1,248 ఆలయాలను నిర్వహించే బాధ్యతను టీడీబీకి అప్పగిస్తూ ట్రావెన్‌కోర్ నిర్ణయం తీసుకుంది.