తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి (మంగళవారం) ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఇవాళ రాత్రి స్వామివారు గజ వాహనంపై కనువిందు చేయనున్నారు. ఇక సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.
రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు. తిరుమల వేంకటేశ్వరస్వామివారికి అన్నగా పేరొందిన శ్రీ గోవిందరాజస్వామి వారు కొండ మీద వడ్డీ కాసుల్ని కొలవడంతో అలసిపోయారట. దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతారు. ఈ కథనానికి తగ్గట్టే కుంచాన్ని తలగడగా చేసేుకుని నిద్రిస్తున్నట్టుగా స్వామివారి విగ్రహం ఉంటుంది. ఇక అన్న కనోసం తమ్ముడు తిరుమల నుంచి ప్రతి ఏడాది కార్తీక మాసం కృత్తికా నక్షత్ర సమయంలో అన్న తిరుమంజనానికి మంచి నూనె, తమలపాకులు పంపిస్తూ ఉంటారు.