ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ బుధవారం అంటే ఇవాళ సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గోదా కల్యాణం జరగనుంది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. గోదా కళ్యాణాన్ని వీక్షించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీలో భక్తులు గోదా కల్యాణాన్ని వీక్షించవచ్చు.
శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు వేడుకగా కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలతో ముగుస్తుంది. భక్తులు ఈ కల్యాణంలో పాల్గొని స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. నేటి ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 15న అత్యంత ఘనంగా జరగనుంది.