తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కోసం తేనెను ఎక్కడి నుంచి సేకరిస్తారంటే..

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి వారికి నిత్యం అభిషేకం నిర్వహిస్తూనే ఉంటారు. ఈ అభిషేకాల్లో తేనె అభిషేకం కూడా ఒకటి. మరి శ్రీవారి అభిషేకానికి తేనె అంటే కల్తీ లేకుండా చాలా స్వచ్ఛమైనదిగా ఉండాలి. మరి ఇంత స్వచ్ఛమైన, కల్తీలేని తేనెను టీటీడీ ఎక్కడి నుంచి సేకరిస్తుందంటారా? అటవీ ప్రాంతం నుంచి.. గిరిజనులు సేకరించి టీటీడీకి విక్రయిస్తారు. గిరిజనులు అడవి నుంచి తేనెను సేకరిస్తారు. దానికి ఎటువంటి ప్రెజర్వేటివ్స్ కెమికల్స్ వాడకుండా ప్యాకింగ్ చేసి వినియోగదారులకు తేనెను అందిస్తారు. ఈ తేనెను టీటీడీ కొనుగోలు చేసి దేవస్థానం పూజ, నైవేద్యం, అభిషేకం వంటి వాటిలో వినియోగిస్తూ ఉంటుంది.

120 కు పైగా తిరుమల తిరుపతి దేవస్థానం పరీక్షలు చేసి, ఎటువంటి కెమికల్స్ లేవని నిర్దారించిన తరువాతనే ఈ తేనెను శ్రీవారి కోసం వినియోగిస్తుంది. టీటీడీ వారు కిలో తేనెను రూ.290లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గిరిజనులు ఈ తేనెను అడవిలో స్వతహాగా తేనెటీగల తెట్టల పైన పెట్టిన పట్టు నుంచి సేకరిస్తారు. ఆపై ఎటువంటి మలినాలు లేకుండా శుద్ధి చేస్తారు. నిల్వ ఉండేందుకు ఎటువంటి ప్రిజర్వేటివ్స్‌నూ కలపరు. అనంతరం శుద్ధి చేసి తేనెను బాటిల్స్‌లో ప్యాక్ చేస్తారు. ఆపై రాష్ట్రమంతటా జీసీసీ తేనేగా అగమర్క్ నాణ్యతతో కూడిన తేనెను మార్కెటింగ్ చేస్తున్నారు.

Share this post with your friends