పండుగ సందర్భాలతో పాటు కొన్ని ప్రత్యేక రోజుల్లో మహిళలు సర్వసాధారణంగానే ఉపవాసం ఉంటుంటారు. హైందవ సంస్కృతిలో ఉపవాసం కూడా ఒక భాగమైపోయింది. ఉపవాసం చేసే వారిలో కొందరైతే అసలేమీ తినరు. కొందరు పాలు తాగుతారు. కొందరు పండ్లు తింటారు.అయితే పాలు, పండ్లు కూడా తినకూడదని చెబుతుంటారు. అసలు తినవచ్చా? అని కొందరికి డౌట్ ఉంటుంది. అసలేమీ తినకూడదని కొందరంటారు. అసలు వాస్తవమేంటో చూద్దాం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం. మరి దీనికి.. ఆహారం తీసుకోకుండా ఉండటానికి సంబంధం ఏంటి అంటారా?
కొన్ని ఆహార పదార్థాలు మన బుద్ధిని మందగించేలా చేయడంతో పాటు ఆందోళనకు కారణమవుతాయట. అప్పుడు మనసును దేవునిపై పెట్టలేమట. కాబట్టి తేలికపాటి ఆహారాన్ని తీసుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అలాగే భగవంతుని ధ్యానంలో గడిపవచచు. ఉపవాసమనేది నిర్బంధమేమీ కాదు. ఎవరికి వారు స్వయంగా ఏర్పాటు చేసుకున్న క్రమశిక్షణ కాబట్టి, ఆనందంగా ఉపవాసం చేస్తుంటారు. ఉపవాస సమయంలో జీర్ణ వ్యవస్థకూ.. మొత్తం శరీరానికి కొంత విశ్రాంతినిచ్చినట్టు అవడంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే ఉపవాసం చేయడం మంచిదేనని అంటారు.