దసరా సమయంలో ఒకవైపు రామ సేన.. మరోవైపు రావణ సేన చేరి..

దసరా ఉత్సవాల్లో కొన్ని చోట్ల రక్తాలు కూడా పారుతాయి. అంతలా యుద్ధం జరుగుతుంటుంది. ఊరు ఊరంతా రెండు గ్రూపులుగా విడిపోయి మరీ కొట్టుకుంటారు. ఇది మరెక్కడో కాదు.. కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో జరుగుతుంది. ఇక్కడ దసరా సమయంలో రాళ్ళ యుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో స్థానికకులంతా కాలువ ఒడ్డుకు చేరుకుంటారు. కాలువకు అటూ ఇటూ కంకర రాళ్ళను గుట్టగా పోసుకుంటారు. ఒకవైపు రామసేన.. మరోవైపు రావణ సేనగా ఊహించుకుని మరీ రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్దం చేసి విజయం చేసినట్లు భావిస్తారు. దీనిని వీపనగండ్ల వాసులు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు.

ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత ఎక్కువగా ఉత్సవం జరిగినట్లు స్థానికులు విశ్వసిస్తారు. ఇదే సమయంలో ఇదే జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో కూడా బన్నీ ఉత్సవం జరుగుతుంది. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు, దేవరగట్టు నెలవై ఉన్న రెండు గ్రామాల పరిధిలోని ప్రజలతో కొట్లాడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండేలా చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి ఇనుప తొడుగులు తొడిగిన వెదురుకర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు. అనాదిగా జరుగుతున్న ఈ రక్తపాతానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా సంప్రదాయంగా వస్తున్న ఆచారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

Share this post with your friends