ఈ శివాలయంలోకి నీరు ఎలా వస్తుందో తెలియదు.. ఎలా వెళుతుందో తెలియదు..

ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక ఓ శివాలయంలోకి అయితే నీరు వస్తుంది.. కానీ ఎలా వస్తుందో తెలియదు.. దానంతట అదే పోతుంది కానీ ఎక్కడికి పోతుందో తెలియదు. ఈ ఆలయం ఎక్కడుందంటారా? తెలంగాణ రాష్ట్రంలో, మెదక్ జిల్లాలో కొప్పోలు అనే ఊరిలో ఉంది. ఈ ఊరు నిజాంసాగర్‌కు వెనుక ఉంటుంది. ఈ ఊళ్లో చిన్న గుట్టపై మహా శివుడు స్వయంభువుగా వెలిశాడు. 50 సంవత్సరాల క్రితం అయితే ఈ ప్రాంతమంతా అడవిలాగా ఉండేది. కర్ణాటకలోని బసవకళ్యాణ పీఠాధిపతి శ్రీ మదనానంద సరస్వతి స్వామి ఇక్కడ కొతకాలం తపస్సు చేసుకుని ఆ సమయంలోనే ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఆపై అనేక విగ్రహాలను ప్రతిష్టించారు.

ఆసక్తికర విషయం ఏంటంటే.. గర్భాలయం స్వత:సిద్ధంగా ఏర్పడిన గుహ. దీనిలో కొలువు దీరిన శివయ్యను శ్రీ ఉమా సంగమేశ్వరస్వామి అని పిలుస్తారు. ఇక ఇక్కడి విశేషం ఏంటంటే.. ఈ స్వామికి అభిషేకించిన నీరు బయటకు రాకుండా గర్భాలయంలోనే భూమిలో ఇంకిపోతుంది. ఎటు వెళ్తందో తెలియదు. మరో విశేషం ఏంటంటే.. శ్రావణ మాసంలో గర్భగుడిలో కింద నుంచి వచ్చిన నీటితో గర్భాలయమంతా నిండిపోతుంది. ఒక్కోసారి శివలింగం కూడా మునిగిపోతుంది. ఆ తరువాత ఆ నీరంతా దానంతట అదే తగ్గిపోతుంది. అసలు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో.. ఎక్కడి నుంచి పోతుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందని నమ్మకం. కాబట్టి వివిధ దేశాల నుంచి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

Share this post with your friends