శనివారం అస్సలు చేయకూడని పనులివే..

మనకు నవ గ్రహాలున్నాయి. వీటిలో హిందూ మత విశ్వాసాల ప్రకారం.. శనీశ్వరుడిని కర్మ ప్రధాతగానూ.. న్యాయాధిపతిగానూ భావిస్తూ ఉంటాం. శనీశ్వరుడు అంటేనే జనాలు కాస్త భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కష్టసుఖాలను ఇచ్చేది ఆయనే కాబట్టి. అయితే మనిషి కర్మానుసారమే కష్టసుఖాలను శనీశ్వరుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ముఖ్యంగా శనీశ్రుడిని శనివారం పూజిస్తూ ఉంటాం. శని త్రయోదశి వచ్చిందంటే దాదాపు హిందువులంతా తప్పక శనిపూజ నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి శనివారం భోళా శంకరుడిని పూజించాలి.

అయితే జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నా లేదంటే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తప్ప శనిదేవుని పూజించుకోవాల్సిందే. శనివారం నాడు ఆలయానికి వెళ్లి శని దేవుడికి పూజ చేస్తే సమస్యలన్నీ తొలిగిపోతాయని నమ్మకం. అయితే శనివారం కొన్ని పనులు అస్సలు చేయకూడదట. అవేంటంటే.. శనివారం రోజున బొగ్గు, ఉప్పు, తోలు, బూట్లు, నల్ల నువ్వులు, మినప పప్పు, చీపురు, నూనె, కలప, ఇనుము లేదా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు. అలాగే శనివారం పొరపాటున కూడా జట్టు కత్తిరించుకోవడం, గోళ్లు తీసుకోవడం వంటివి కూడా చేయకూడదు. ఇక స్వామివారికి ఇష్టమైన నల్ల దుస్తులు ధరిస్తే మంచిదట. నల్లగా ఉండే జంతువు దేనికైనా ఆహారం తినిపిస్తే మంచి జరుగుతుందని నమ్మకం.

Share this post with your friends