భర్తకు భార్య ఏ వైపున ఉండాలో తెలుసా?

హిందువులు తమ జీవన విధానంలో ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి కూడా సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. హిందూ పూజా విధానంతో పాటు పూజలు చేసే సమయంతో పాటు వివిధ సందర్బాల్లో భార్యాభర్తల అమరిక కూడా ఆచార వ్యవహారాల్లోకి వచ్చి చేరింది. పూజలు, పెళ్లిలు, వేడుకల్లో భార్య భర్తకు ఎటువైపు ఉండాలనేది కూడా తెలిసి ఉండాలి. ఏ కార్యానికైనా సరే.. భర్తకు భార్య ఎటువైపు ఉండాలి? ఏంటి? అంటే.. భారతదేశ సంప్రదాయం ప్రకారం భర్తకు భార్య ఎక్కువగా ఎడమవైపున మాత్రమే ఉండాలి.

శాస్త్రాలు.. బ్రహ్మదేవుడు మగవారికి కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడనిచెబుతున్నాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ ఎడమ వైపునే ఉండాలా? అంటే కాదు. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పూజాధికాలు నిర్వహించేటప్పుడు, దానాలు, ధర్మాలు చేసే సమయాన భార్య భర్త ఎడమవైపున ఉండాలి. ఇక కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్ఠలప్పుడు మాత్రం భర్తకు కుడివైపున భార్య ఉండాలి. శ్రీమహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు. ఇక శివుడు అర్థనారీశ్వరుడు.. శరీరంలో సగ భాగం పార్వతీదేవి ఉంటుంది. అయితే ఆ సగ భాగం ఎడమ వైపునే ఉంటుంది.

Share this post with your friends