సిక్త్ సెన్స్ నిజంగానే ఉంటుందా? ఉంటే మనమెందుకు గుర్తించడం లేదు?

సిక్త్ సెన్స్ నిజంగానే ఉంటుందా? జంతువులకు అయితే పక్కాగా ఉంటుందంటారు.. మరి మనుషులకో.. వారికి కూడా ఉంటుందట. కానీ గుర్తించడమే కాస్త కష్టం. ఎందుకో మనం దానిపై ధ్యాస పెట్టమనేది నిజం. మారువేషంలో ఉన్న రావణాసురుడికి సీతమ్మ తల్లి భిక్ష వేసేందుకు గానూ.. లక్ష్మణ రేఖ దాటడానికి ముందు ఆమె కుడి కన్ను అదిరిందని పండితులు చెబుతారు. మరి ఆమె గుర్తించలేదో ఏమో కానీ రావణుడి అపహరణకు గురైంది. మనకు కూడా ఏదైనా జరగబోయే ముందు ఏదో ఒక సంకేతం అయితే వస్తుందట. కానీ మనం దానిని పరిగణలోకి తీసుకోం. కళ్లు అదరడమో.. శరీర భాగాలు అదరడం.. అరికాలు దురద పెట్టడం వంటివి జరుగుతుంటాయి.

మనకు కలలు రావడం కూడా ఏదో ఒక సంకేతమేనని చెబుతారు. కానీ వాటిని ఏమీ మనం పరిగణలోకి తీసుకోం. అసలు ఏదైనా సంకేతం అనే దిశగా ఆలోచనే చేయము. మనకూ.. జంతువులకు ఒక రకంగా సిక్త్ సెన్స్ పని చేస్తుంటుంది. అవి గుర్తించగలుగుతాయి.. మనుషులు గుర్తించలేరు. దీనికి కారణం.. మన ఉరుకులు, పరుగుల జీవితమే. ఆడవారికి ఎడమవైపు, మగవారికి కుడివైపున కన్ను అదరటం శుభ సూచకమని పెద్దలు అంటారు. అలాగే అర చెయ్యి.. లేదంటే అరి కాలు దురద పెట్టడం కూడా జరగబోయే మంచి చెడులకు సంకేతమేనంటారు. మరి మనకు ఇన్ని హింట్స్ వస్తున్నా మనం గుర్తించలేకపోవడానికి కారణమేంటంటే.. ప్రశాంతతకు, ప్రకృతికి దూరమడం.. ధ్యానం, భగవన్నామస్మరణ, యోగా వంటివి మనలోని సిక్త్స్ సెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి.

Share this post with your friends