గృహ ప్రవేశం చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి..

సొంతిల్లు ఏర్పాటు చేసుకోవాలని ఎవరికి ఉండదు? చిన్నదో పెద్దదో ఒక ఇల్లంటూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. శ్రావణ మాసంలో ఎక్కువగా గృహ ప్రవేశాలకు ముహూర్తం పెట్టుకుంటారు. అయితే గృహ ప్రవేశం చేసే సమయంలో ఐదు విషయాలను మాత్రం తప్పక గుర్తు పెట్టుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. మరి ఆ ఐదు విషయాలేంటో చూద్దాం. ముందుగా ప్రధాన ద్వారం తప్పక ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ సాధ్యం కాలేదంటే ప్రధాన ద్వారం తలుపు తూర్పు దిక్కున ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. కొత్తింట్లోకి వెళ్లడానికి ముందే వాస్తు దోషాలను నిపుణుడి సలహా తీసుకుని వాస్తు దోషాలు ఏమైనా ఉంటే సవరించుకోవాలి.

ఇక గృహ ప్రవేశాన్ని ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేయకూడదు. తేదీ, శుభ ముహూర్తాన్ని ముందుగానే ఎంచుకోవాలి. శుక్ల పక్షంలోని గురువారం, శుక్రవారం లేదా ఆదివారం గృహ ప్రవేశం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. కొత్త ఇంట్లోకి వెళ్లిన వారు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలట. ముందుగా వినాయకుడిని పూజించుకుని ఆపై సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందట. కొత్త ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలట. ఇలా ఉంచడం వలన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందట. తద్వారా సిరిసంపదలకు లోటుండదట.

Share this post with your friends