గణేషుడిని ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తామో తెలుసా?

తిధుల్లో చతుర్థి తిథి ముఖ్యంగా గణపతి పూజకు చాలా విశిష్టమైనది. ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి తిథి వస్తుంది. ఇవి రెండూ గణేశుడికి అంకితం చేయబడినవే. జ్యేష్ఠ మాసం వచ్చే శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చతుర్థి అంటారు. ఇక ఈ రోజున ఏం చేయాలి? ఏంటనే విశేషాలు ప్రతి ఒక్కరికీ తెలిసినవే. ఇక సంకష్ట చతుర్థి గురించి మాత్రం కొందరికే తెలుసు. ఈ రోజున ఉపవాసం ఉండి.. గణపతిని పూజిస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రేపు మధ్యాహ్నం 3.44 గంటలకు ప్రారంభమై జూన్ 10 సాయంత్రం 04:14 గంటలకు ముగుస్తుంది. కాబట్టి జూన్ 10న సంకష్ట చతుర్థిని జరుపుకుంటాం.

ఇదంతా సరే కానీ అసలు గణేషుడిని ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తామో తెలుసా? దీనికి ఒక కథ ఉంది. ఒకసారి పరశురాముడు శివుడిని కలవడానికి కైలాస పర్వతానికి వెళతాడు. అక్కడ పరమేశ్వరుడిని దర్శనం చేసుకునేందుకు లోపలికి వెళ్లబోగా.. పరశురాముడిని గణేషుడు లోపలికి వెళ్లనివ్వడు. దీంతో పరశురాముడికి చాలా కోపం వస్తుంది. అయినా సరే గణేశుడు ఏమాత్రం వెనక్కి తగ్గడు. మరింత కోపోద్రిక్తుడైన పరశురాముడు గొడ్డలితో గణేషుడిని కొడతాడు. దీంతో గణేషుడి దంతాలలో ఒకటి విరిగిపోతుంది. అప్పటి నుంచి గణేషుడిని ఏకదంతుడు అని పిలుస్తారు. ఇలా వినాయకుడిని ఏకదంతుడిగానూ.. విఘ్నాలకు అదిపతి కాబట్టి విఘ్నేశ్వరుడిగానూ పలు పేర్లతో పిలుస్తూ ఉంటారు.

Share this post with your friends