కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారో తెలుసా?

కొత్త బట్టలు కట్టుకునే ముందు హిందువులు తప్పనిసరిగా పసుపు రాస్తారు. దీనికి కారణమేంటో చాలా మందికి తెలియదు కానీ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం కాబట్టి ఫాలో అయిపోతూ ఉంటాం. నిజానికి పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదనేది అందరికీ తెలిసిందే. ఎన్నో రోగాలకు పసుపు దివ్యౌషధంలా పని చేస్తుంది. అందుకే పసుపుని భారతీయులు జీవితంలో ఓ భాగాన్ని చేసుకున్నారు. కొత్త బట్టలను కొని తీసుకువచ్చి ఉతక్కుండానే ధరిస్తూ ఉంటాం. బట్టల తయారీలో ఎన్నో రసయనాలు వాడుతూ ఉంటారు.

ఇక పూర్వ కాంలో అయితే నేసిన దుస్తులను వాడేవాడు. బట్టలను నేసే ముందర నూలుకు పిండితో తయారైన గంజిని పెడతారు. రసాయనాలు కావచ్చు.. గంజి కావచ్చు.. నిలువ ఉన్నప్పుడు వాటిపై క్రిములు వచ్చి చేరుతాయి. కాబట్టి కొత్త బట్టలకు పసుపు రాస్తే ఈ సూక్ష్మక్రిములను అది కొంత వరకూ నాశనం చేస్తుంది. తద్వారా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే బట్టలకు ఏమైనా గంజి ఉన్నా కూడా పసుపు కారణంగా గంజి వాసన తగ్గుతుందట. అలాగే పసుపును అన్ని శుభకార్యాల్లో తప్పనిసరిగా వాడుతుంటాం.

Share this post with your friends