దుర్గమ్మను ఏ ఏ రోజుల్లో పూజించాలో తెలుసా?

దేవతలకు ఒక ప్రత్యేక రోజంటూ ఉంటుంది. ఆ రోజుల్లో పూజిస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మనం కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని శనివారం.. సోమవారం శివుడిని.. మంగళవారం హనుమంతుడిని.. బుధవారం అయ్యప్ప స్వామిని పూజిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. మరి కనకదుర్గమ్మను ఎప్పుడు పూజించాలో తెలుసా? వ్యాస మహర్షి రచించిన దేవీభాగవతంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దుర్గమ్మ తల్లిని కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజిస్తే ఆపదలు, గండాలు తొలగిపోవడమే కాకుండా దారిద్య్ర బాధలు తొలగిపోయి, ఐశ్వర్యం లభిస్తుందట.

దుర్గమ్మను ఏ రోజుల్లో పూజించాలో తెలుసుకుందాం. అందరి దేవుళ్ల మాదిరిగా దుర్గమ్మకు ఒక రోజు కాదు రెండు ప్రత్యేక దినాలు ఉన్నాయి. వీలును బట్టి ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజున పూజలు చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం అమ్మను పూజించుకునేందుకు అనువైన రోజులు. మన కోరిక తప్పక నెరవేరాలన్నా.. కష్టం తొలగాలన్నా ఈ రోజుల్లో దుర్గమ్మను పూజించాలి. మంగళ లేదంటే శుక్రవారాల్లో ఏదో ఒక రోజును కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా అమ్మవారికి పూజ చేస్తే సత్ఫలితం ఉంటుందట. ముఖ్యంగా దుర్గాదేవికి ‘నవ’ అంటే తొమ్మిది సంఖ్య ప్రధానం కాబట్టి తొమ్మిది వారాల పాటు అమ్మవారికి క్రమం తప్పకుండా పూజ చేసుకుంటే మంచిది.

Share this post with your friends