రామాయణ, భాగవతాల్లో ఆదితీర్థంగా పిలుచుకునే ఆలయమెక్కడుందో తెలుసా?

సృష్టికర్త బ్రహ్మకు ఆలయాలు ఉండవు. దీనికి ఒక కథ ఉంది. అలాగే త్రిమూర్తుల్లో కెల్లా బ్రహ్మ చిన్నవాడు. అయినా సరే.. మనం ఆయన చిత్ర పటాన్ని లేదంటే విగ్రహాన్ని చూస్తే వృద్దుడిలా బ్రహ్మ కనిపిస్తాడు. ఇది ఎందుకు అంటారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం రాజస్థాన్‌కు వెళ్లాల్సిందే. అక్కడ అజ్మీర్‌కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్‌. తర్వాతి కాలంలో ఈ ప్రాంతమంతా ఈ సరస్సు పేరు మీదుగానే ఫేమస్ అయ్యింది. అలాగే ఈ సరస్సు చెంతనే బ్రహ్మ దేవుడి ఆలయం మనకు కనిపిస్తుంది.

ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధి గాంచింది. మన దేశంలోని అతి ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి గాంచింది. మనం పుణ్యక్షేత్రం సందర్శనను ప్రారంభిస్తే.. పుష్కర్‌ను సైతం తప్పక దర్శించుకోవాలట. అలా దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్టేనట. అందుకే దీనిని తీర్థరాజ్ అని కూడా పిలుస్తారు. పౌరాణికంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అంతేకాకుండా మహాభారత, రామాయణాల్లోనూ దీని గురించి ప్రస్తావన ఉంది. వాటిలో దీనిని ఆదితీర్థంగా పిలవడం జరిగింది. కార్తీక పౌర్ణమి రోజున ఇందులో ఓసారి మునిగితే వందల సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుందట.

Share this post with your friends