క్షీరసాగర మథనం జరిపించిన గెటప్‌లోనే జగన్మోహనుడి దర్శనం.. ఎక్కడో తెలుసా?

పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. వాటిలో క్షీరసాగర మథనం ఒకటి. ఆ కథ గురించి తర్వాత తెలుసుకుందాం కానీ ఆ తతంగాన్నంతా జగన్మోహనుడు ఒంటి చేత్తో జరిపిస్తాడు. ఇక క్షీరసాగర మథనం జరిపించిన గెటప్‌లో జగన్మోహనుడు మనకు ఒక ఆలయంలో కనిపిస్తాడు. ఆ ఆలయమేంటి? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. కర్ణాటకలోని ఉడిపిలో కొలువైన బాలకృష్ణుడు చేతిలో కవ్వంతో.. నడుము చుట్టూ మువ్వల మొలతాడుతో.. చిరునవ్వులు చిందిస్తూ.. కోటి సూర్యుల సరిసాటి తేజస్సుతో దర్శనమిస్తాడు. ఉడుపి అనేది శ్రీకృష్ణుడికి ఇష్టమైన నగరమట.

ఉడుపిలో బాలుడి రూపంలో స్వామివారు పూజలందుకుంటూ ఉంటాడు. ఆయనకు నిత్య నైవేద్యమేంటో తెలుసా? చాలా ఇష్టమైన వెన్నముద్దలు, పాలబువ్వ. ఇక్కడ మూలమూర్తిని ద్వైత గురువైన మధ్వాచార్యులు ప్రతిష్టించారు. మరో విశేషం ఏంటంటే.. ఈ ప్రతిమకు దేవశిల్పి విశ్వకర్మ ప్రాణం పోశారని ప్రతీతి. రుక్మిణి దేవి కోరిక మేరకు విశ్వకర్మ స్వామి వారి ప్రతిమకు ప్రాణం పోశారట. ద్వారక సముద్రంలో కలిసి పోయాక పదమూడో శతాబ్దంలో ఈ విగ్రహం మధ్వాచార్యుల వారికి దొరికిందట. ఉపాలయాలపై చెక్క ఓ కథ మనలన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Share this post with your friends