జపం ఎక్కడ చేస్తే ఉపయోగం ఉంటుందో తెలుసా?

క్రమశిక్షణ, ఉన్నత జీవనం అలవడాలంటే ధ్యానం. జపం చేయాలి. ఇవి మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళతాయి. ఈ కాలం క్షణం తీరిక లేని జీవితాల నేపథ్యంలో జనాలకు జపాన్ని, ధ్యానాన్ని చేసేంత తీరిక లేదనే చెప్పాలి. కొద్ది నిమిషాల సమయం దేనికీ వెచ్చించలేకపోవడం వల్లనే చాలా పనుల్లో విఫలమవుతూ ఉంటాం. వీటికి పరిష్కారంగా అందరికీ అందుబాటులో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకోదగినది జపం. మెంటల్ టెన్షన్ అనేది లేకుండా చేస్తుంది. ఒకరకంగా సమస్యలన్నింటి నుంచి ఈ జపం మనల్ని బయట పడేస్తుంది. నిజానికి జపం అనే మాట చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

జపం అంటే ఒక దేవతా మంత్రాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఆ మంత్రంలోని వైబ్రేషన్‌ను సొంతం చేసుకోవడం. నిజానికి దీనికి కాస్త ఓపిక అవసరం. పరిసరాలను మరచిపోయి పూర్తి కాన్సన్‌ట్రేషన్ పెట్టాలంటే కొంత కష్టమే. అయితే దీని ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. జపం ఎంత బాగా చేస్తే ఫలితం అంత బాగుంటుంది. కొందరు నదుల వద్ద.. కొందరు ఇంట్లో.. కొందరు ఆలయాల్లో జపం చేస్తూ ఉంటారు. జపం చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట. గోశాలలో జపం చేస్తే వందకు వంద శాతం ఫలితం ఉంటుందట. యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది. ఇక దేవాలయాల్లో జపం చేసినా.. ముఖ్యంగా పరమేశ్వరుడి సన్నిధిలో జపం చేసినా ఊహించలేనంత ఫలితం ఉంటుందట.

Share this post with your friends