వరలక్ష్మీ వ్రతం చేసుకోవాల్సిన సమయం ఏంటో తెలుసా?

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణ మాసాన్ని పండితులు పేర్కొంటూ ఉంటారు. ఈ మాసమంతా పండుగలు, శుభకార్యాలు, వ్రతాలు, పూజలతో నిత్యం సందడిగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ మాసంలో లక్ష్మీదేవిని కొలుచుకుంటూ ఉంటారు. ఇక నెలలోనే వరలక్ష్మీ వ్రతం కూడా చేసుకుంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం దాదాపుగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఈ రోజున చేసుకోలేని వారు మరో శుక్రవారం చేసుకుంటారు. ఈ ప్రకారంగా చూస్తే ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.

వరలక్ష్మీ వ్రతం చేసుకునే డేటు అయితే తెలిసింది. ఇక ఆ రోజున ఏ సమయంలో వ్రతం చేసుకోవాలి? అంటే వరలక్ష్మీ వ్రతానికి పండితులు కొన్ని సమయాలు సూచించారు. ఆ సమయాలేంటో చూద్దాం.

కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమై.. రాత్రి 8:22 వరకు ఉంటుంది. వ్యవధి 1:27 నిమిషాలు

సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 5:57 గంటలకు ప్రారంభమై 8:14 వరకూ ఉంటుంది. వ్యవధి 2:17 గంటలు

వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12:50 గంటల నుంచి.. 3:08 గంటల వరకూ ఉంటుంది. వ్యవధి 2:19 గంటలు

వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి 11:22 గంటల నుంచి తెల్లవారు జామున 1:18 నిమిషాల వరకు ఉంటుంది. వ్యవధి 1:56 నిమిషాలు

Share this post with your friends