పూరి జగన్నాథుడి ఆలయం నీడ ఏమవుతుందో తెలుసా?

ఒడిశా పూరి జగన్నాథుడి రథయాత్రకు వేళవుతోంది. మరికొన్ని గంటల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రథయాత్ర జరుగనుంది. దీని కోసం రథం సహా సర్వం సిద్ధమయ్యాయి. హిందూమతంలోని నాలుగు ధామాలలో పూరిని ఒకటిగా పేర్కొంటూ ఉంటారు. ఈ జగన్నాథుని ఆలయంలో దేవుడు సజీవంగా ఉన్నాడని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయ రహస్యాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ఒకటి పూరి జగన్నాథుడి ఆలయ నీడ కనిపించకపోవడం. ఇది ఏదో ఒక సమయంలో మాత్రమే జరగదు. రోజులో ఏ సమయంలోనూ పూరి జగన్నాథుని ఆలయ నీడ మనకు కనిపించదు.

కనీసం ఆలయ శిఖరం నీడ అయినా కనిపించాలి కదా.. అది కూడా కనిపించదు. ఈ రహస్యాన్ని ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు సైతం ఛేదించలేకపోయారు. ఇదొక దైవిక అద్భుతమని కొంతమంది చెబుతారు. ఆలయ నిర్మాణమే ఆలయ శిఖర నీడ నేలను చేరని విధంగా జరిగిందని మరికొందరు చెబుతారు. సూర్యుని కిరణాలు ఆలయాన్ని తాకుతాయి కానీ నీడ మాత్రం ఆలయంపైనే పడే విధంగా నిర్మాణం జరిగింది. పూరి జగన్నాథుని నీడ అయితే పడుతుంది కానీ అది ఎవరికీ కనిపించదు.

Share this post with your friends