7 ఆదివారాల పాటు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తాన లేచి శుచిగా స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. ఇలా చేయనిదే వారికి రోజు ప్రారంభమవదు. ఇక సూర్య భగవానుడిని ప్రతి ఆదివారం పూజించుకుంటే మరింత ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడి అనుగ్రహం కోసం అర్ఘ్యం సమర్పించడం, ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది. ఆదివారం ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుందట. వరుసగా 7 ఆదివారాలు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే సూర్యుడి అనుగ్రహం తప్పక లభిస్తుందట.

ప్రతి ఆదివారం బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. దీని వల్ల సూర్యుడి అనుగ్రహం మెండుగా ఉంటుంది. దీని తరువాత అర్ఘ్యం సమర్పించిన చోట నిలబడే ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి. అనంతరం సూర్యునికి హారతివ్వాలి. ఇలా 7 వారాల పాటు చేస్తే మనసులోని కోరికను సూర్య భగవానుడికి చెబితే అది తప్పక నెరవేరుతుందట. పైగా అనారోగ్య సమస్యలున్నా కూడా తప్పక నయమవుతాయట. ఇలా చేయడం వలన అరోగ్యంగా ఉండటమే కాకుండా సూర్యుని వంటి తేజస్సు.. జీవితంలో ఉన్నతి, కీర్తి ప్రాప్తిస్తాయట.

Share this post with your friends