బిల్వపత్రానికి పార్వతీ మాత ఏం వరం ఇచ్చిందో తెలుసా?

శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. సాధారణంగా పువ్వులు కానీ.. ఆకులు కానీ ఎండితే పూజకు పనికి రావు. కానీ మారేడు దళాలు మాత్రం ఎండినా పూజకు ఉపయోగపడుతుంది. బిల్వ పత్రాలను శివపూజకు సమర్పిస్తే.. కోటి ఏనుగుల దాన ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల వల్ల కలిగే ఫలం లభిస్తుందట. అసలు బిల్వ పత్రానికి ఎందుకంత ప్రాధాన్యత అనడానికి ఓ కథ ఉంది. ఒకసారి పరమశివుడు పార్వతి దేవితో కలసి భూలోకంలో వనవిహారం చేస్తోందట.

ఆ సమయంలో అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షాన్ని చూసి పార్వతిదేవికి ముచ్చటగా అనిపించిందట. వెంటనే మారేడు దళాలను చేతిలోకి తీసుకుందట. అప్పుడు మారేడు దళం నమస్కరిస్తూ.. తన జన్మ అమ్మవారి స్పర్శతో తరించిందని పేర్కొందట. అప్పుడు పార్వతీ దేవి ఏమైనా వరం కోరమనగా.. ‘నేను ఆకుగా పుట్టాను, ఆకుగా పెరిగాను ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లీ’ అని వేడుకొందట. అప్పుడు మారేడు దళానికి పార్వతీదేవి శివపూజలో విశిష్ట స్థానాన్ని ప్రసాదించిందంట. అప్పటి నుంచి మారేడు దళం శివపూజలో ప్రముఖంగా మారింది. అంతేకాకుండా మారేడు దళాల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుందట. కాబట్టి శివయ్యను మారేడు దళాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుందట.

Share this post with your friends