బతుక్ భైరవ కథేంటో తెలుసా?

బతుక్ భైరవ గురించి ఉత్తరాది వారికి బాగా తెలుసు. మనకు ఆయన గురించి దాదాపు తెలియదనే చెప్పాలి. ఇవాళ బతుక్ భైరవ జయంతి. శివుడినే భైరవుడిగా కొలుస్తూ ఉంటాం. ఇవాళ అన్నదానం చేస్తే శని దోషాల నుంచి విముక్తి లభిస్తుందట. ఇవాళ బతుక్ భైరవుని పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మనకు శత్రువుల కుట్రలు తిప్పికొట్టే సమర్ధతో పాటు శత్రు జయం కలుగుతుందట. అసలు బతుక్ భైరవ కథేంటంటే.. పూర్వంలో ఆపద్ అనే రాక్షసుడు చాలా కఠోరమైన తపస్సు చేసి దేవతలు, మానవుల ద్వారా చావు లేకుండా వరం పొందాడు.

అయితే అతనికి ఐదేళ్ల బాలుని చేతిలో మాత్రమే చావు కలుగుతుంది. ఐదేళ్ల బాలుడు తనను సంహరించలేడనే తలంపుతో అవద్.. బీభత్సం సృష్టించసాగాడు. గర్వంతో దేవతలను, మానవులను వేధించడం ప్రారంభించాడు. దేవతలకు ఓపిక నశించి అంతా కలిసి శివుడిని అవద్ బారి నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు శివుడి ఐదేళ్ల బాలుడి రూపంలో జన్మిస్తాడు. అతనికి బతుక్ బైరవ అని పేరు పెడతారు. ఆ బాలుడు అవద్‌ని సంహరించి దేవతలకు, మానవులకు ఉపశమనం కలిగిస్తాడు. ఆ ఐదేళ్ల చిన్నారిని బతుక్ భైరవగా పూజిస్తూ ఉంటాం.

Share this post with your friends