
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదం అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది లడ్డూయే. అమృతంలా ఉంటుంది. అసలు ముందు లడ్డూ ఘుమఘుమలకే టెమ్ట్ అయిపోతూ ఉంటుంది. రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది. ఏ భగవంతుని ప్రసాదమైనా శ్రీనివాసుని లడ్డూ తరువాతే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు శ్రీవారి ప్రసాదాల గురించి మాత్రమే కాకుండా.. ప్రసాద తయారీ నియమాల గురించి కూడా తెలుసుకుందాం. తిరుమల అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. కొన్ని సేవల సందర్భంలో చక్కెర పొంగలి, పెరుగన్నం కూడా సమర్పిస్తారు.
ఆశ్చర్యమేమిటంటే… స్వామివారికి దోసెలు, మిరియాల అన్నం వంటి వంటకాలు కూడా సమర్పిస్తారు. ఏడుకొండల వాడికి పూటపూటకూ ప్రత్యేక మెనూ ఉంటుంది. రుతువులను బట్టి ఆహారం మారుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక ఈ ప్రసాదాలన్నింటి తయారీకి సంబంధించిన నియమాలేంటో తెలుసుకుందాం. కేవలం మామిడి, అశ్వత్థ, పలాస చెట్ల ఎండిన కొమ్మలతోనే వంట చేస్తారు. వాసన సోకకుండా ముక్కు–నోటికి వస్త్రం కప్పుకొని వంట చేస్తారు. శ్రీవారికి నైవేద్యం సమర్పించే వరకూ బయటి వారెవరూ చూడకూడదు.
