శ్రీవారు మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటో తెలుసా?

శ్రీవారిని తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు. మూడునామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ మూడునామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరచారు. ఏడుకొండలకు నడక దారిన వెళ్లేటప్పుడు కూడా మూడు నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అసలు శ్రీవారికి ఈ మూడు నామాలు ఎందుకు ప్రత్యేకం ?
మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు ? మూడునామాల వాడిగా ప్రసిద్ధ చెందడానికి కారణమేంటి ?

సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి, మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలు. ఈ నామాలు అజ్ఙానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీ మలయప్ప స్వామివారికి మూడు నామాలు అలంకరించారట. అలా…. శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్లీ గురువారం వరకూ అలానే ఉంటాయి.

Share this post with your friends