దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనమేంటో తెలుసా?

భగవంతుడి దగ్గర కొందరైతే నిత్యం దీపారాధన చేస్తుంటారు. కొందరు మాత్రం ఎప్పుడో పండుగ సందర్భంలోనో లేదంటే మరేదైనా ప్రత్యేక సందర్భంలో మాత్రమే వెలిగిస్తూ ఉంటారు. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ ప్రదేశాన్నంతా భిన్నమైన శక్తితో నింపేస్తుందట. అసలు నిత్యం దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది? ఏ నూనెతో వెలిగించాలి? వంటి అంశాలను చూద్దాం. దీపం వెలిగించడానికి ముఖ్యంగా మూడు రకాల నూనెలను వాడుతారు. నెయ్యి, నువ్వుల నూనె, ఆముదంలతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇలా నిత్యం దీపం వెలిగించడం వలన పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు నిండిపోతుందట.

దీపం ప్రాణానికి, పరమాత్మకు ప్రతీకని అంటారు. అందుకే పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. పైగా ఇలా దీపం వెలిగించడం యజ్ఞంతో సమానమట. ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తూ ఉంటే.. సత్ఫలితాలతో పాటు పుణ్యం కూడా వస్తుందట. జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా తొలగి విజయం వరిస్తుందట. అయితే ఈ దీపారాధన కూడా పలు రకాలుగా ఉంటుంది. ఏక వత్తితో దీపం విజయాన్ని ప్రసాదిస్తుందట. రెండు ముఖాల దీపం.. దంపతుల మధ్య అన్యోన్యాన్ని.. మూడు వత్తులతో దీపం పుత్ర దోషాలను.. నాలుగు వత్తులతో దీపం సంపదను.. ఐదు వత్తులతో దీపం అష్టైశ్వర్యాలతో పాటు కుటుంబంలో ఐక్యతను ఇస్తుందట.

Share this post with your friends