కార్తీకమాసంలో దీప దానం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో దీపదానం చేస్తే మనం ఊహించని ప్రయోజనాలు ఉంటాయట. అవేంటో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఆలయాల్లో, తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిదట. అలాగే దీప దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చట. అసలు దీప దానం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటూ కార్తీక మాసంలో దీప దానం చేస్తారు. దీప దానం ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించడంతో పాటు దాని జ్వాల మనలోని జ్ఞానాన్ని సూచిస్తుంది.

కార్తీకమాసంలో దీప దానం చేయడం కలిగే ప్రయోజనం ఏంటంటే.. శ్రేయస్సు, అదృష్టం వృద్ధి చెందుతాయి. అలాగే తలపెట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందట. అలాగే తరతరాలుగా వస్తున్నా పాపాలన్నీ తొలగిపోతాయట. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతల నుంచి విముక్తి కలిగి పాప పరిహారంతో శరీరం, ఆత్మ శుద్ధి అవుతాయని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో దీప దానం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంచి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందట.

Share this post with your friends