గ్రామాల్లో అయితే కావల్సినంత స్థలం ఉంటుంది కాబట్టి ఇంటి చుట్టూ ఏవో ఒక మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. వాటిని మనం అసలు పట్టించుకోం. కానీ పిచ్చి మొక్కలు అని వదిలేసి వాటిలోనే ఔషధ గుణాలు ఉంటాయి. ఎంతటి మొండి రోగాలనైనా అవి తగ్గాయి. కొన్ని మొక్కల వేర్ల నుంచి ఆకులు, కొమ్మల్లోనూ ఔషధ గుణాలుంటాయి. అలాంటి మొక్కల్లో ఒకటి ఉత్తరేణి. వినాయక చవితికి వాడే పత్రిలోనూ ఈ ఉత్తరేణిని ఉపయోగిస్తారు. జ్యోతిష్యంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. ఉత్తరేణికి ఔషధ గుణాలు మాత్రమే కాకుండా యజ్ఞ-పూజలకు అవసరమైన మొక్క.
ఈ ఉత్తరేణి కొమ్మతో దంతాలు తోముకున్న కూడా అవి చాలా బలంగా మారుతాయి. అలాగే పిప్పి పన్ను నొప్పి తగ్గాలన్నా ఉత్తరేణి రసంలో దూదిని ముంచి పిప్పి పన్నుపై పెడితే చాలా నొప్పి తగ్గుతుంది. పౌర్ణమి రోజు ఉదయం ఉత్తరేణి మొక్క మూలానికి పంచోపచార పూజ చేయడం ఉత్తమ ఫలితం ఉంటుంది. దీని వేరుని మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో కట్టుకుంటే జీవితంలోని అతి పెద్ద సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. తెల్లటి ఉత్తరేణి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయట. చెడు దృష్టి నుంచి ఈ ఉత్తరేణి మొక్క వేర్లను పూజించి కుడి చేతికి ధరించాలట.