కాత్యాయని వ్రతం గురించి తెలుసా? అది చేస్తే ఏం జరుగుతుందంటే..

అత్యంత ముఖ్యమైన మాసాల్లో మార్గశిర మాసం కూడా ఒకటి. ఈ మార్గశిర మాసంలో ప్రతి రోజూ పర్వదినంగానే భావిస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో వివాహంలో ఎలాంటి ఆటంకాలున్నా, జాతక దోషమున్నా, రాహు కేతు దోషాలు ఉన్నవారు కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని చెబుతారు. అసలు కాత్యాయని వ్రతం సందర్భంగా ఎవరిని పూజించాలి? కాత్యాయని పూజను ఎప్పుడు ప్రారంభించాలి? ఆ పూజా ఫలితం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. కాత్యాయని అంటే మరెవరో కాదు.. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి. ఆమెనే కాత్యాయనిగా పిలుస్తారు.

శ్రీ కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో నిర్వహిస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం రోజు కాత్యాయని వ్రతాన్ని ఆరంభించాలి. ఇక ఈ మంగళవారం ముఖ్యంగా కృత్తికా నక్షత్రంతో కానీ, షష్టి తిథితో కానీ కూడిన మంగళవారం అయితే మరీ మంచిది. కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో మంగళవారం రోజు మొదలుపెట్టాలని తెలుసుకున్నాం కదా.. దీనిని ఒక్క మంగళవారం కాదు.. మొదలు పెట్టిన తర్వాత వరుసగా 7 మంగళవారాలు భక్తితో ఆచరించాలి. మధ్యలో ఏ వారమైన ఆటంకం వస్తే ఆపై వారము చేసుకొని 8వ మంగళ వారము ఉద్యాపన చేసుకోవాలి.

Share this post with your friends