హరిద్వార్‌లోని శ్రీ యంత్ర దేవాలయం గురించి తెలుసా? ఈ ఆలయం సమ్‌థింగ్ స్పెషల్. ఈ ప్రత్యేకతకు గోపురంతో పాటు చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఆలయ గోపురం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని కారణంగానే ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక ఆలయ నిర్మాణం కూడా చాలా అందంగా ఉంటుంది. దీని నిర్మాణానికి ఇనుము కానీ.. సిమెంట్ కానీ ఉపయోగించలేదు. గంగానదీ తారంలో ఎన్నో దేవాలయాలన్నాయి. అన్నింటిలోనూ ఈ ఆలయం చాలా అందంగా.. గ్రాండ్‌గా ఉంటుంది. అసలు దేంతో ఈ ఆలయ నిర్మాణం జరిపారనేది ఆసక్తికరం.
ఆలయంలోని అద్భుతమైన చెక్కడాలు మనల్ని మైమరచిపోయేలా చేస్తాయి. ఈ ఆలయం రాజస్థాన్‌లోని అత్యుత్తమ రాళ్లతో అద్భుతంగా నిర్మించారు. శ్రీ యంత్రం ప్రతిష్టాపిత ఆలయంలో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం ఇక్కడ ఉన్న 10 మహావిద్యలలో మూడవ స్థానంలో ఉంది. ఈ ఆలయంలో లక్ష్మీదేవితో పాటు త్రిపుర సుందరి దేవి, కాళికా మాత కొలువై ఉన్నారు. ఈ అమ్మవార్ల విగ్రహాలన్నీ బంగారంతోనే తయారు చేశారు. ఈ ఆలయంలో సరస్వతి దేవి విగ్రహం కూడా ఉంటుంది. అలాగే భోలే నాథుడి విగ్రహాన్ని సైతం ప్రతిష్టంచారు. ఆలయంలో మొత్తంగా రెండు శ్రీయంత్రాలు ఏర్పాటు చేశారు.