తిరుమల ఆలయం దేశంలోనే సుప్రసిద్ధ దేవాలయం. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని క్షణ కాల దర్శనం జన్మజన్మల పుణ్యంగా భావిస్తూ ఉంటాయి. అలాంటి వేంకటేశ్వరుని ఆలయ సంపదను కాపాడేందుకు కొందరు దేవతలు ఉంటారన్న విషయం చాలా మందికి తెలిసి ఉండదు. శ్రీవారి ఆలయ మహా దర్శనం దగ్గర నేలపై నీళ్లు ఉంటాయి. అక్కడ మనం కాళ్లు కడిగే పనిలో నిమిగ్నమై అక్కడ ఇద్దరు దేవలకు సంబంధించిన రెండు విగ్రహాలను గమనించాం. అవి చాలా చిన్నగా ఉండటంతో మన చూపు ఆ విగ్రహాలపై పడదు. అసలు ఆ విగ్రహాలు కథేంటో.. ఆగమ శాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం.
మనం గుర్తించని ఆ ఇద్దరు దేవతలే శ్రీవారి సంపదను కాపాడుతున్నారట. ఆ దేవతల పేర్లు శంకనిధి, పద్మనిధి. వీరు కొన్నేళలుగా ఆలయ మహాద్వారం ఉంటూ ఆలయ సంపదను కాపాడుతున్నారని ప్రతీతి. మహాద్వారం గడపకు పంచహోల మూర్తులుగా ఈ దేవతులంటారు. ద్వారానికి ఎడమవైపున రెండు శంఖాలున్న పంచలోహ మూర్తి అయిన దేవతను శంకనిధి అని పిలుస్తారు. కుడివైపున రెండు పద్మాలతో ఉండే రక్షణ దేవతను పద్మనిధి అంటారు. ఆలయంలోనికి వెళ్లడానికి ముందు.. వెళ్లి వచ్చిన తర్వాత ఈ దేవతలకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్మకం. ఈసారి తిరుమలకు వెళ్లినప్పుడు వీరిని చూసి భక్తితో మొక్కుకుని రండి.