కృష్ణుడి అష్ట భార్యలలో ఒకరైన మిత్రవింద గురించి తెలుసా?

శ్రీకృష్ణుడికి అష్ట భార్యలని తెలుసు. వారిలో రుక్మిణి, సత్యభామ మాత్రం అందరికీ తెలుసు కానీ మిగిలిన వారి గురించి పెద్దగా తెలియదు. మిత్రవింద కృష్ణుడి మేనత్త కూతురు. ఆమె త్రండి జయసేనుడు అవంతీ రాజ్యాధిపతి కాగా.. ఆమెకు వింద్య, అనువింద్యలనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. మిత్రవిందకు శ్రీకృష్ణుడంటే చాలా ఇష్టం. కానీ ఆమె సోదరులకు అస్సలు నచ్చడు. అందుకే మిత్రవిందకు దుర్యోధనుడితో పెళ్లి చేయాలనుకుంటారు. దీని కోసం ప్లాన్ చేసి కృష్ణుడు మినహా మిగిలిన వారందరినీ పిలిచి మిత్రవిందకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో మిత్రవింద కూడా అన్న మాటకు తలొగ్గి గత్యంతరం లేని పరిస్థితిలో స్వయంవరానికి సిద్ధపడుతుంది. ఇక మిత్రవింద స్వయంవరం విషయం బలరాముడి చెవిన పడుతుంది. వరుసైన తనను, తన సోదరుడు శ్రీకృష్ణుడిని పిలవకుండా స్వయంవరమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. విషయాన్ని కృష్ణుడి చెవిన వేస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు అవంతి రాజ్యానికి బయలుదేరుతాడు. సోదరి సుభద్ర ద్వారా తనంటే కూడా మిత్రవిందకు చాలా ఇష్టమని తెలుసుకున్న శ్రీకృష్ణుడు తనను అడ్డుకున్న వింద్య, అనువింద్యలతో యుద్ధం చేసి మిత్రవిందను ద్వారకకు తీసుకెళ్టి వివాహం చేసుకుంటాడు. ఈ జంటకు ఏకంగా పది మంది పిల్లలు.

Share this post with your friends